డేటింగ్ యాప్ పరిచయంతో యువకుడికి హనీ ట్రాప్ షాక్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

డేటింగ్ యాప్లో పరిచయమైన యువతితో పబ్కు వెళ్లిన హైదరాబాద్కు చెందిన హేమంత్ను పబ్ సిబ్బందితో కలిసి మోసగించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. క్వాక్ క్వాక్ యాప్ ద్వారా దివ్య అనే యువతితో పరిచయం ఏర్పడిందని, జూబ్లీహిల్స్లోని కెమిస్ట్రీ పబ్లో ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చూపించి రూ. 29 వేల బిల్లు చెల్లించేలా బోల్తా కొట్టించారని హేమంత్ వాపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీటీవీ టేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.