మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అచ్చెన్నాయుడు ఫైర్

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీకాకుళం

కష్టపడి ఉద్యోగాలు సాధించిన మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయడం సరికాదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే మెగా డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.