తాడూరు రైస్ మిల్లులో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం మాయం
రిపోర్టర్: సతీష్
స్థలం: తాడూరు
తాడూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రూ.19.59 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైన ఘటన వెలుగుచూసిందని ఎస్ఐ ఎం. రాము తెలిపారు. సివిల్ సప్లయ్, పోలీస్ అధికారులు శనివారం జరిపిన తనిఖీల్లో 8,755.883 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు మిల్లు మేనేజింగ్ పార్టనర్ పొనుగంటి సుధాకర్రావుతో పాటు మరో నలుగురు భాగస్వాములపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.