కడప రాజకీయాల్లో వైఎస్ జగన్కు గట్టి షాక్: మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ

రిపోర్టర్: అశోక్ స్థలం: Kadapa

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగుతో పాటు పలు మున్సిపాలిటీలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుందని తెలిపారు. పులివెందులపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని, ఉమ్మడి జిల్లాలో ప్రజలు సరికొత్త రాజకీయ మార్పులను చూడబోతున్నారని ఆమె వెల్లడించారు.