దసరా ప్రయాణికులకు షాక్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల టికెట్ ధరలు పెంపు

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

దసరా బతుకమ్మ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. కూకట్పల్లి నుంచి విజయవాడకు వెళ్లే ఏసీ స్లీపర్ బస్సు ధరను ఏకంగా రూ.1,700 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. అనుమతులు లేని నకిలీ నంబరు బస్సులను రోడ్లపైకి తెస్తున్నారని, ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీవో రవికుమార్ హెచ్చరించారు.