యూపీఐ లావాదేవీలపై సర్వీస్ ఛార్జీల పెంపుపై నేడు స్పష్టత!

రిపోర్టర్: మహేష్ స్థలం: India

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐ లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయా లేదా అనే అంశంపై ఎన్‌పీసీఐ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. రూ.2,000 దాటిన డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పునరుద్ధరణ లేదా సవరణలపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే వ్యాపారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.