సోషల్ మీడియా రీల్స్ చూసి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కన్యాకుమారి

సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ రీల్స్ పోస్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు కన్యాకుమారి ఘటన వెల్లడించింది. మధుమిత అనే ఇన్ఫ్లుయెన్సర్ ఇంటిలో కోటి రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితులు బాధితుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని, ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.