జూరాల ప్రాజెక్టు నుంచి తక్షణమే సాగునీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశం
రిపోర్టర్: నరేష్
స్థలం: మహబూబ్‌నగర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల సాగునీటి సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడటమే లక్ష్యంగా ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు కాలువల ద్వారా నీటి విడుదలను ప్రారంభించడంతో రైతులకు పెను ఊరట లభించింది.