రైల్వే ప్రయాణికులకు తీపి కబురు: బెంగళూరు ముంబై వందే భారత్ ప్రారంభం
రిపోర్టర్: సురేష్
స్థలం: అనంతపురం
నవంబర్ మొదటి తేదీన బెంగళూరు నుంచి ముంబై వరకు కొత్త వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. ఇటీవల సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.