ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకల నిర్వహణ

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరు మండలంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సీఐ గుత్తి వెంకట్రావు ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. మండపాల ఏర్పాటుకు పోలీస్ పోర్టల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.