పాన్ ఇండియా స్థాయిలో హారర్ థ్రిల్లర్ '418' సినిమా విడుదల వాయిదా
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న క్రేజీ హారర్ థ్రిల్లర్ ‘418’ సినిమా విడుదల వాయిదా పడింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో పాన్ ఇండియా మూవీగా గ్రాండ్‌గా విడుదల చేయాలని భావించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఉత్తరాదిలో డిమాండ్ పెరగడంతో త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వెల్లడించారు.