బెల్లంపల్లిలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
రిపోర్టర్: SHIVA
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్లను సోమవారం ఆవిష్కరించనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. తాండూరు మండల అధ్యక్షురాలు సూరం సాయిరాణి, కార్యదర్శి కొండు సాయికుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
తాండూరు మండల కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్లో సోమవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మండలంలోని యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.