కామారెడ్డి జిల్లాలో పదోన్నతి పొందిన సిబ్బందికి ఎస్పీ రాజేష్ చంద్ర అభినందనలు

రిపోర్టర్: రమేష్ స్థలం: కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఏడుగురు సిబ్బందికి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందనలు తెలిపినట్లు ఎస్పీ కామారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు సేవలందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆయన సూచించారని పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారిలో పలువురు స్థానిక పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.