'సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా': నెల్లిమర్ల నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం మాధవి
రిపోర్టర్: విజయ్
స్థలం: Nellimarla
నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం ముంజేరు గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.10,09,519 విలువైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఈ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎంతో ఊరటనిస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.