ఇళ్ల స్థలాలు ఇచ్చి హద్దులు చూపని వైనంపై పేదల ఆవేదన

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలం ఇర్లపాడు పంచాయతీ పరిధిలోని ఇస్కపల్లి గ్రామంలో గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినప్పటికీ, అధికారులు ఇప్పటివరకు హద్దులు చూపకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇరవై ఒక్క ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి హద్దులు చూపాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు.