ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మహిళా క్రీడాకారిణులకు పురందేశ్వరి అభినందనలు
రిపోర్టర్: రమేష్
స్థలం: తూర్పు గోదావరి
ఆసియా క్రీడల మహిళల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారిణులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అభినందించారు. ఆసియా క్రీడల 2026 పోటీల్లో మహిళల నాలుగు ఇంట నాలుగు వందల మీటర్ల రిలే విభాగంలో కిరణ్ పహల్, పూవమ్మ, ప్రాచి చౌదరి, విథ్యా రామ్రాజ్ అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. ఈ మేరకు వారిని కొనియాడుతూ ఆమె ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.