బండ్లగూడలో గంజాయి ముఠా గుట్టురట్టు: నిందితుడి అరెస్ట్, కిలో పైగా సరుకు స్వాధీనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని బండ్లగూడ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న షేక్ ఆసిఫ్ అనే ఆటో డ్రైవర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు Hyderabad City Police వెల్లడించారు. చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ మరియు బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్ లో నిందితుడి నుంచి సుమారు 1.94 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.