మురసు తుఫాను బాధితులకు భరోసా: ప్రభావిత ప్రాంతాల్ లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
మురసు తుపాను తీవ్రతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి, నేడు ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, మునిగిపోయిన కాలనీలను పరిశీలించి బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.