గుర్గావ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: Haryana

గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్ శివానీ చౌహాన్‌ను కారుతో కావాలనే ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు కల్యాణ్ బైన్సలాను రాజస్థాన్‌లోని దౌసాలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.