సైబర్ నేరగాళ్ల మాయలో పడొద్దంటూ మోత్కూరు పోలీసులు హెచ్చరించారు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోత్కూరు పోలీసులు సూచించారు. మంగళవారం మోత్కూరు పాత బస్టాండ్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, OTP, UPI మోసాల గురించి ప్రజలకు వివరించారు. ఖాతా వివరాలను ఇతరులకు వెల్లడించవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్సై తెలిపారు.