పాకిస్తాన్ జట్టును తక్కువ చేయడం సరికాదు: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
ఇంగ్లాండ్ పర్యటనలో వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ జట్టును తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, ఇది ఇరు జట్లను అవమానించడమేనని స్పష్టం చేశారు. ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయలేమని, పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని రూట్ గుర్తు చేశారు. పేలవ ప్రదర్శన నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే కోచ్‌ను తొలగించి భారీ మార్పులు చేసింది.