విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
విద్యార్థుల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సరికొత్త ప్రత్యేక రాయితీ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా 12 ఏళ్లు పైబడిన విద్యార్థులకు విమాన బేస్ ఛార్జీలపై ఫ్లాట్ పది శాతం డిస్కౌంట్ లభించనుంది. దీనితో పాటు సాధారణ 15 కేజీలకు తోడు అదనంగా మరో 10 కేజీలు కలిపి మొత్తం 25 కేజీల లగేజీని తీసుకెళ్లవచ్చు. వెబ్సైట్లో బుక్ చేసుకుంటే రూ. 99 నామమాత్రపు రుసుముతోనే ప్రయాణ తేదీని మార్చుకునే సదుపాయం కల్పించారు.