ఒంటెలు, మీసాల పోటీలు: జోధ్పూర్లో ఘనంగా మార్వార్ ఫెస్టివల్ వేడుకలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: జోధ్‌పూర్

రాజస్థాన్ చారిత్రాత్మక బ్లూ సిటీ జోధ్పూర్లో మార్వార్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా ప్రారంభమైందని అధికారులు తెలిపారు. రాజపుత్రుల వీరగాథలు, సాంప్రదాయాలను చాటిచెప్పేలా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సరిహద్దు భద్రతా దళం జవాన్ల ఒంటెల కవాతు, బ్యాండ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ ప్రాంతాల కళాకారుల జానపద నృత్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ రెండ్రోజుల వేడుకల్లో మీసాలు, తలపాగా చుట్టే పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.