సీఎంవోపై కేటీఆర్ సంచలన ఆరోపణలు: టెండర్లలో పదిహేను శాతం కమీషన్ల దందా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్టులోనూ ముఖ్యమంత్రి కార్యాలయం పదిహేను శాతం కమీషన్ డిమాండ్ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, సొంత ఖజానాను నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టెండర్ల ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, ముడుపులు చెల్లించిన తర్వాతే బిల్లులు విడుదల చేస్తున్నారని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.