రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ రాహుల్ గాంధీపై రామ్ మాధవ్ మండిపాటు

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భాజపా జాతీయ ఉపాధ్యక్షులు వారణాసి రామ్ మాధవ్ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేస్తున్న నిరాధార విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. పరాజయ భయంతోనే ప్రతిపక్షాలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని రామ్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అందించిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.