బొబ్బిలిలో ఘనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ తో కలిసి బొత్స సత్యనారాయణ హాజరై పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు.