శ్రామిక నాయకుడు గుండా మల్లేష్ ఆదర్శాలను కొనసాగించాలి: సీపీఐ నేతలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

తాండూర్ మండలంలో సీపీఐ ఆధ్వర్యంలో తొలి ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్సింగ్ భవన్ నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికులు, పేదల హక్కుల కోసం గుండా మల్లేష్ నిరంతరం పోరాడారని మండల కార్యదర్శి కొండు బానేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.