'వన్యప్రాణుల రక్షణలో రైల్వే శాఖ విఫలమైంది': అస్సాంలో రైలు ఢీకొని ఏనుగుకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: హరి
స్థలం: అస్సాం
అస్సాంలోని హవైపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సిల్చార్-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఒక అడవి ఏనుగు తీవ్రంగా గాయపడింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రాంతంలో ఏనుగుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఏనుగుకు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.