ట్రంప్ నివాసం వద్ద అత్యాధునిక లేజర్ యాంటీ డ్రోన్ అస్త్రం మోహరింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఫ్లోరిడా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ వద్ద అత్యాధునిక లేజర్ ఆధారిత యాంటీ డ్రోన్ ఆయుధాన్ని మోహరించినట్లు నార్డాడ్ మరియు అమెరికా నార్తర్న్ కమాండ్ అధికారులు వెల్లడించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అభ్యర్థన మేరకు ఈ భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాయు మార్గాల ద్వారా ముప్పును తిప్పికొట్టేందుకు ఏరోవిరాన్మెంట్ లోకస్ట్ లేజర్ వ్యవస్థను రక్షణ రంగం రంగంలోకి దించిందని స్పష్టం చేశారు.