రైతన్నలకు తీపి కబురు: సాగు యంత్రాల అద్దె కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: రామభద్రపురం
రామభద్రపురం మండల కేంద్రంలో వ్యవసాయ సాగు యంత్రాల అద్దె కేంద్రాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మంగళవారం ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన ఆయన తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.