టెక్ ప్రపంచంలో కలకలం: వీడియోస్ట్రాంగ్ కంపెనీతో సంబంధాలు తెంచుకున్న గూగుల్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

లక్షలాది ఆండ్రాయిడ్ పరికరాల్ లో రహస్యంగా మాల్ వేర్ చొప్పించి మోసాలకు పాల్పడిన తయారీ సంస్థ వీడియోస్ట్రాంగ్ తో తమ సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. ఈ మేరకు సుమారు పదమూడు లక్షల డివైజ్ లలో బ్యాక్ డోర్ ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు పాల్పడినట్లు గూగుల్ వెల్లడించింది. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆ సంస్థపై కఠినమైన నిషేధం విధించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.