అయోధ్యలో అమితాబ్ బచ్చన్ తండ్రి పేరిట ధర్మశాల నిర్మాణం!

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన తండ్రి, ప్రసిద్ధ కవి డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ జ్ఞాపకార్థం అయోధ్యలో భారీ ధర్మశాలను నిర్మించనున్నారు. అయోధ్యలోని దశరథ్ మార్గ్‌లో రూ.15 కోట్లతో కొనుగోలు చేసిన స్థలంలో 20కి పైగా గదులతో ఈ ధర్మశాల నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన లేఅవుట్ అనుమతి కోసం అయోధ్య అభివృద్ధి ప్రాధికార సంస్థకు దరఖాస్తు సమర్పించారు.