గుర్రంకొండ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంకొండ
విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టినట్లు హెడ్మాస్టర్ తకిఉల్లా ఖాన్ తెలిపారు. మంగళవారం ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా గుర్రంకొండ పోస్ట్ ఆఫీస్ ను విద్యార్థులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వేశ్వర్ రెడ్డి, వెంకట్ రమణ, విజయసింహారావు, పద్మలత, జ్యోతి, వాణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.