ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో లాభాల పంటగా మారుతున్న సీవీడ్ సాగు
రిపోర్టర్: శివ
స్థలం: తూర్పు గోదావరి
సముద్రపు నాచు సాగుతో మత్స్యకారులకు అదనపు ఆదాయం లభిస్తుందని విశాఖపట్నం సీఎంఎఫ్ఆర్ఐ టెక్నికల్ ఆఫీసర్ రవికుమార్ అవధానుల తెలిపారు. విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ, కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో పాటు నాచు పెంచడం వల్ల చేపల వ్యర్థాలు నాచుకు, నాచు ఇచ్చే ఆక్సిజన్ చేపలకు ఉపయోగపడతాయన్నారు. భూమి, మంచినీరు అవసరం లేని ఈ సాగు ద్వారా ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీకి ముడిసరుకు లభిస్తుందని పేర్కొన్నారు.