బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ అవినీతిపై ఆరోపణలు చేసినందుకే క్రిశాంక్‌పై అక్రమ కేసులు బనాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ అవినీతిని బయటపెడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం క్రిశాంక్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.