కెవిన్ పీటర్సన్ కంటే హ్యారీ బ్రూక్ ప్రతిభ చాలా ఎక్కువ: బెన్ స్టోక్స్

రిపోర్టర్: రమేష్ స్థలం: World

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 114 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శనపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. బ్రూక్ టాలెంట్ కెవిన్ పీటర్సన్ కంటే మెరుగ్గా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. బ్రూక్ ఆట చూస్తుంటే అద్భుతంగా ఉందని కొనియాడారు.