బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న డెంగ్యూ ఆస్పత్రుల్లో రోగుల రద్దీ

రిపోర్టర్: రమేష్ స్థలం: బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆస్పత్రులకు తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 747 మంది రోగులు ఆస్పత్రుల్లో చేరారు. ఢాకాలోని ముగ్దా జనరల్ ఆస్పత్రిలో కేవలం 38 బెడ్ల సామర్థ్యం ఉన్న వార్డులో ఏకంగా 145 మంది డెంగ్యూ రోగులకు చికిత్స అందిస్తున్నారు. బెడ్లు సరిపోక నేల మీద, వరండాలలోనే వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59,147 మంది ఆస్పత్రిపాలవ్వగా, 176 మంది మృతి చెందారు.