తీవ్ర తుఫాను ముప్పు: ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్ నినో

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సరళిని పూర్తిగా మార్చేస్తున్న ఎల్ నినో ప్రభావం రానున్న కాలంలో మరింత తీవ్రం కానుందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు డబ్ల్యూఎమ్ఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో వెల్లడించారు. 2026 అక్టోబర్ - డిసెంబర్ కాలంలో ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోనున్నాయని, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.