క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రులను కోరిన ప్రధాని నరేంద్ర మోదీ

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రుల సలహా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ మూడో విడత ప్రభుత్వ పాలన ప్రగతిని సమీక్షించడంతో పాటు, మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దేశాభివృద్ధి లక్ష్యంగా త్వరలో మరో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.