ఖమ్మంలో దివ్యాంగ మహిళల కోసం ఉచిత వ్యాపార శిక్షణ తరగతులు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం రూరల్ మండలంలోని దివ్యాంగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి పది రోజుల ఉచిత వ్యాపార శిక్షణ నిర్వహించనున్నారు. చిన్న వ్యాపారాల ఏర్పాటుపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. ఆసక్తిగల మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ కోరారు. పరిమిత సీట్లు మాత్రమే ఉన్నందున వివరాలకు సంబంధిత ఫోన్ నంబర్లను సంప్రదించాలి.