అమెరికా విడాకుల తీర్పు భారత్‌లో చెల్లదన్న సాకేత్ కోర్టు

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

అమెరికా న్యాయస్థానాలు ఏకపక్షంగా ఇచ్చే విడాకుల తీర్పులు భారతదేశంలో చెల్లుబాటు కావని దిల్లీలోని సాకేత్ ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, భర్తకు వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన తీర్పులను భారతీయ చట్టాలు అంగీకరించవని స్పష్టం చేసింది. వివాహం విచ్ఛిన్నమైందనే ప్రాతిపదికన విడాకులు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పింది.