పురుషోత్తపురంలో సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్మాత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సరుబుజ్జిలి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు శుక్రవారం అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు భాస్కరశర్మ ఆధ్వర్యంలో లలితా సహస్రనామార్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.