మేడిపల్లిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: మేడిపల్లి
గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపుల బంద్‌ను ఆసరాగా చేసుకుని అక్రమంగా మద్యం నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ జలేందర్ రెడ్డి తెలిపారు. నారపల్లి, బోడుప్పల్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వైన్స్ మేనేజర్‌పై కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.