'ఇంచు భూమైనా తీయగలిగే శక్తి ఉందా?': సీఎం రేవంత్ రెడ్డి సవాల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీలో 22ఏ భూముల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ధరణి అనే పురుగు తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించిందని, కేసీఆర్ భూ దోపిడీ ఆలోచనల నుంచే ఇది పుట్టిందని మండిపడ్డారు. కోటి ఎకరాల నిషేధిత జాబితా నుంచి ఇంచు భూమైనా తీయగలిగే శక్తి ప్రతిపక్షాలకు ఉందా అని సవాల్ విసిరారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉన్న లేఔట్ల పెండింగ్ రిజిస్ట్రేషన్లను వారంలో పరిష్కరిస్తామని, త్వరలోనే నూతన విధానం తెస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.