టీ20ల్లో చరిత్రాత్మక మైలురాయిని దాటిన భారత్
రిపోర్టర్: విజయ్
స్థలం: Sano
అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో రెండు వందల విజయాల ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సించింది. జపాన్‌తో సానో వేదికగా జరిగిన ఐదు ఓవర్ల వర్ష ప్రభావిత మ్యాచ్‌లో కేవలం రెండు పరుగుల తేడాతో విజయం సాధించి టీమిండియా ఈ చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగా, లక్ష్య ఛేదనలో జపాన్ ముప్పై పరుగులకే పరిమితమైంది.