సెప్టెంబర్ సెషన్ మ్యాట్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: India

ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) నిర్వహించే మ్యాట్ (MAT) 2026 సెప్టెంబర్ సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. PBT పరీక్ష సెప్టెంబర్ 13న, CBT పరీక్ష సెప్టెంబర్ 20న జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 600కు పైగా బిజినెస్ స్కూళ్లలో MBA, PGDM ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు mat.aima.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా విధానం, ఫీజు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.