విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి నారాయణమ్మ పాట విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి చిత్ర యూనిట్ తాజాగా నారాయణమ్మ పాటను విడుదల చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు వెల్లడించారు.