ఇంట్లోనే దోమల వృద్ధి కేంద్రాలు: గుర్తించాల్సిన ఏడు ముఖ్యమైన ప్రదేశాలివే

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

ఇంట్లో దోమల బెడద తీవ్రంగా మారడానికి చిన్న చిన్న ప్రదేశాలలో నీరు నిల్వ ఉండటమే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పూలకుండీల ట్రేలు, ఏసీ డ్రిప్ ట్రేలు, పాత టైర్లు, నీటి తొట్లలో నిల్వ ఉండే నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పూన్ పరిమాణంలో నీరు నిల్వ ఉన్నా వందలాది దోమలు పుట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.