సముద్రంలో రెండు నెలలుగా చిక్కుకున్న వృద్ధుడు మరియు కుక్క రెస్క్యూ

రిపోర్టర్: కిరణ్ స్థలం: California

అమెరికాలో ఎనభై ఆరు ఏండ్ల వృద్ధుడు తన పెంపుడు కుక్కతో కలిసి సముద్రంలో రెండు నెలలకు పైగా చిక్కుకుపోగా, కోస్ట్గార్డ్ అధికారులు అప్రమత్తమై విజయవంతంగా రక్షించినట్లు అమెరికా కోస్ట్గార్డ్ కమాండర్ జేసన్ న్యూయెన్ వెల్లడించారు. పడవ తెరచాపలు దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడిన వారిని శాన్ డియాగో తీరానికి సుమారు నాలుగు వందల అరవై మైళ్ల దూరంలో గుర్తించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.