తిరుమలలో ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

రిపోర్టర్: హరి స్థలం: తిరుపతి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ దృష్ట్యా ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. మరోవైపు గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.6.93 కోట్లు నమోదైంది.